Friday, November 15, 2024

బియ్యం ఎగుమతులపై నిషేధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం నుంచి బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిలిపివేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) గురువారం ప్రకటన వెలువరించింది. దేశీయంగా బియ్యం సరఫరా సక్రమానికి, ధరల నియంత్రణకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో ఇప్పటికే నాణ్యమైన బియ్యం ధర కిలో రూ 60 వరకూ ఉంది. వచ్చే నెల నుంచి పండుగల సీజన్ కావడంతో ధరలు మరింతగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అయింది. దీనితో సాధారణ తెల్లబియ్యం ఎగుమతిని నిషేధించారు. అయితే పారాబాయిల్డ్ నాన్‌బాస్మతి, బాస్మతి రకం బియ్యం ఎగుమతులు యధావిధిగా ఉంటాయి.

ఈ విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. కాగా ఇప్పటికే లోడింగ్ దశలో ఉన్న బియ్యం ఎగుమతిని అనుమతిస్తారు. మొత్తం బియ్యం ఎగుమతులలో బాస్మతియేతర బియ్యం వాటా పాతికశాతం వరకూ ఉంటుంది. బియ్యం ఎక్కువగా థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాలకు ఎగుమతి అవుతోంది. ఏడాది కాలంగా దేశంలో బియ్యం ధరలు మొత్తం మీద 11.5 శాతం పెరిగాయి. నెలరోజులలో 3 శాతం వరకూ పెరిగాయి. ధరలను నియంత్రించేందుకు ఈ ఎగుమతి నిషేధానికి దిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News