సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో 2023 సభ్యత్వాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పిఆర్టియు రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణ శాఖ నేతృత్వంలో ప్రాథమిక పాఠశాల ఇందిరానగర్, ప్రాథమికోన్నత పాఠశాల కలకుంట్ల కాలనీలలో సభ్యత్వాన్ని ప్రారంభించి రెండు పాఠశాలలో ఉపాధ్యాయులందరికీ పిఆర్టియు సభ్యత్వం అందజేసిన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల జిపిఎఫ్, సరెండర్ బిల్లులు ,మెడికల్ బిల్లులు గత సంవత్సరం కాలంగా పెండింగ్లో ఉన్నాయని ఉపాధ్యాయులు పెళ్లిళ్లు అనారోగ్యం తదితర అవసరాల కోసం దరఖాస్తు చేసుకుంటే కొంత కాలం పెండింగ్లో ఉండడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని రఘోత్తంరెడ్డి అన్నారు.
సమస్యలన్నీ పరిష్కరించే సత్తా కలిగిన అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘం పిఆర్టియు మాత్రమేనని త్వరలోనే ప్రభుత్వాన్ని మెప్పించి పిఆర్సి కమిషన్ వేయిస్తామని బదిలీలు పదోన్నతుల కృషి చేస్తామని బదిలీలు కానీ పక్షంలో పదోన్నతులు ప్రక్రియ పూర్తి చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధర్ శర్మ, గౌరవాధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి పంతం వెంకటరాజం, సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తుల బాపురెడ్డి, బెంజరం నరసింహారెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సురేందర్ రెడ్డి , వై మల్లారెడ్డి ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ కలకుంట్ల కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయ రెండు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.