కమాన్‌పూర్: నిరుద్యోగులు వర్తక, వ్యాపారాల్లో రాణించాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో శ్రీచక్ర సిల్క్‌అండ్ ఫ్యాషన్ షాపును సర్పంచ్ నీలం సరితతో కలిసి జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా తమ కాళ్లపై తాము నిలిచి ఉండేందుకు ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, ఉపసర్పంచ్ బొజ్జ సాగర్, నాయకులు నీలం శ్రీనివాస్, పెండ్లి నారాయణ, గడప కృష్ణమూర్తి, బొల్లపల్లి లక్ష్మయ్యగౌడ్, బొమ్మగాని అనిల్ గౌడ్, మేడగోని విజయ్ గౌడ్, దామెర సంపత్, నీల రాజయ్య, గొడిశెల లింగస్వామి, నక్క శంకర్, జంగపల్లి చిన్న శ్రీనివాస్, చిప్పకుర్తి అరుణ్, పొన్నం నవీన్, ఇనగంటి మురళీమనోహర్, జంగపల్లి సది, అగ్గిమల్ల నర్సయ్య, అంబటి కనుకయ్య, భూపెల్లి మల్లేష్, పోతుల శివ, సాన సురేష్‌లతోపాటు తదితరులు పాల్గొన్నారు.