పెద్దపల్లి: ప్రజలకు అవగాహన కల్పించేందుకు పది శాతం ఈవీం యంత్రాలను వినియోగిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రియాంక అన్నారు. గురువారం స్థానిక తహసిల్ ఆఫీసు సమీపంలోగల ఈవీఎం గోడౌన్ నుంచి పలు రాజకీయ పార్టీల సమక్షంలోఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్లను తరలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిస్తామని అన్నారు. ఇందులో 83 బ్యాలెట్ యూనిట్లు, 83 కంట్ల్ యూనిట్లు, 83 వీవీ ప్యాట్లను తరలించి, జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంకు తరలిస్తున్నామని అన్నారు.
వీటిని పరిశీలించేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అధికారులు, రాజకీయ పార్టీలకు సందర్శనకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, ఎన్నికల డీటీ ప్రవీణ్, బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీడీపీ, సీపీఐ ఎం ప్రతినిదులు రాజ్ కుమార్, సంపత్ రావు, శ్రీకాంత్, ప్రశాంత్, శారద, తిరుపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు