Monday, December 23, 2024

మోడీ.. అమిత్ జీ ఎక్కడున్నారు..?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మణిపూర్ హింస టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇటీవలే చోటు చేసుకున్న ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారి పై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభు త్వంపై భగ్గుమంటున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మంత్రి కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా బాధాకరమన్నారు.భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నా కేంద్రం ఎందుకు మౌనంగా చూస్తోంది? అంటూ ప్రశ్నిం చారు. ‘తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరు స్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోం ది.

ప్రధాని మోడీజీ, అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి’ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మహిళల పట్ల దారుణంగా వ్యవహరించిన, అత్యాచారానికి పాల్పడిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు శాంతికాముకులైన మణిపూర్ ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఈ అమానవీయ ఘటనను సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి దారుణ ఘటన ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని వ్యాఖ్యానించింది. వర్గ కలహాల ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించడం రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వల్ల తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే సమయం ఇదేనని, నేరస్థులను శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వానికి ఆయన ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News