- Advertisement -
నిర్మల్: జిల్లాలో కురుస్తున్నకుండపోత వానలతో కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1,86,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 1,36,291 క్యూసెక్కుల వరద నీటిని బయటకి వదులుతున్నారు.
కాగా, కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696.25 అడుగులుగా కొనసాగుతుంది.
- Advertisement -