- Advertisement -
హైదరాబాద్: ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో జలమండలి అధికారులు సాయంత్రం 4 గంటలకు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్నట్లు ప్రకటించారు. హిమాయత్ సాగర్ 2 గేట్లను ఒక్కో ఫీటు వరకు పైకి ఎత్తి వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. రెండు గేట్లను ఒక ఫీటు ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని కిందికి వదలనున్నామని అధికారులు వెల్లడించారు. జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నందున జలమండలి ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
- Advertisement -