Monday, November 25, 2024

దొంగలు ఏకమవుతున్నారు.. రైతులారా జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణరాష్ట్రంలో ప్రజలకు,రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేయాలనే కపట బుద్దితో దొంగలంతా ఏకమవుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం నేరెడుచర్ల క్లస్టర్ రైతు వేదికలో రైతు సదస్సులో పాల్గొని ప్రసగించారు. తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్‌రెడ్డి క్షమాపన చెప్పాలన్నారు. రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా తగిన బుద్ది చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు సాగునీరు, నాణ్యమైన ఉచిత విద్యుత్, సబ్సీడీ రుణాలు, సకాలంలో రైతుబంధు, ఎరువులు అందిస్తున్నారన్నారు.రైతులకు 3గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడతామన్నారు. ఉచిత విద్యుత్‌కు ఉరివేసేందుకు గాంధీభవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. సీ ఎం కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రూ.3500కోట్లతో అభివృద్ధి చేశానని గత 20సంవత్సరాలలో జరగని అభివృద్ధిని కేవలం మూ డున్నరేండ్లలో చేసి చూపించామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ లకుమళ్ళ జ్యోతిబిక్షం,జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొనతం సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్ళూరి లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి లింగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News