టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం పట్ల సినిమా టీమ్ కృతజ్ఞతను, సంతోషాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ – ఈ సినిమా హిట్ అయినా కాకున్నా ఆర్టిస్టులుగా మాకు పేరొస్తుందని చెప్పారు మారుతి గారు. ఈ సినిమాకు థియేటర్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి నమ్మలేకపోయాం. మేము నటిస్తుంటే జనాలు ఇంతగా రియాక్ట్ అవుతారని ఊహించలేదు. ఇవాళ మా టీమ్ కు కంగ్రాట్స్ చెప్పేందుకు వచ్చిన అల్లు అర్జున్ గారికి థాంక్స్. అన్నారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – అల్లు అర్జున్ గారి నటన అంటే ఇష్టం. ఆయన నాకొక ఇన్సిపిరేషన్. నేను ఇవాళ బాగా నటించానని పేరొచ్చిందంటే అందులో ఐకాన్ స్టార్ ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే పేరును బేబీ మార్చేసింది. ప్రయత్నిస్తే ఇక్కడి అమ్మాయిలు కూడా సక్సెస్ అందుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్ కృతజ్ఞతలు చెబుతున్నా. ఇంత వర్షంలోనూ బేబీ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయంటే మా సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ఊహించుకోవచ్చు. అని చెప్పింది.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – సాయిరాజేశ్ ఈ సినిమా కోసం నా దగ్గరకు వచ్చి 20 నిమిషాలు కథ చెప్పాడు. చేద్దామన్నా అని ఒప్పుకున్నా. అయితే ఇందులో 6 నిమిషాల పాట ఒకటి సింగిల్ టేక్ లో చేయాలి అన్నాడు. నాకు డ్యాన్సులు రావు సింగిల్ టేక్ సాంగ్ అంటున్నాడు అని భయపడ్డా. కొద్ది రోజుల పాటు అల్లు అర్జున్ అన్న పాటలు, డాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేశా. అలా మీరు మాకు ఇన్సిపిరేషన్ ఇస్తూనే ఉంటారు. నేను అనుకోకుండా నటుడిని అయ్యా. అయితే సినిమాలో మన క్యారెక్టర్ బాగా చేస్తే నటుడిగా గుర్తింపు వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. అల్లు అర్జున్ అన్న కూడా ఎన్ని ఆటంకాలు దాటి ఇంత పెద్ద స్టార్ అయ్యాడో మనకు తెలుసు. మా టీమ్ కు మీ విశెస్ ఎప్పుడూ కావాలి. అన్నారు
దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ – బేబీ సినిమా చూసి ఐకాన్ స్టార్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో మేము ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయాం. ఆయన ఒక కామన్ మాస్ ఆడియన్ ఎలా రియాక్ట్ అవుతాడో అలా రివ్యూ చెప్పాడు. అల్లు అర్జున్ గారు చెప్పింది పదే పదే గుర్తుచేసుకుంటూ మా హీరో హీరోయిన్స్ కు ఆ విషయాలన్నీ షేర్ చేసుకున్నా. ఆయన చెప్పింది వింటుంటే ఒక రాజమౌళి మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. మేము మీకు రుణపడి ఉంటాం అల్లు అర్జున్ అన్నా. మీరు ఇచ్చిన సపోర్ట్ తో బేబీ రేపటి నుంచి థియేటర్ లో మరింత హౌస్ ఫుల్ అవుతుంది. అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ప్రాణం సినిమా డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు పోగొట్టుకున్నప్పుడు బన్నీ పిలిచి మందలించాడు. ఆ తర్వాత ఆర్య సినిమా డిస్ట్రిబ్యూషన్ బన్నీ సజెషన్ మేరకే చేశాం. అలా బన్నీ వాసుకు, నాకు ఆ సినిమాలో లాభాలు వచ్చాయి. మా వాసు, నేను, యూవీ వంశీ కెరీర్ లు స్టార్టయ్యాయి. మా కెరీర్ కు అలా బన్నీ ఫిల్లర్ గా ఉన్నాడు. ఈరోజుల్లో సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చి ఎంకరేజ్ చేశాడు. అల్లు అర్జున్ లాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్ లో ఏదైనా సాధించగలం. ఇంత పేరు, ఇమేజ్ ఉండి కూడా రోజుకు 18 గంటలు కష్టపడతాడు. ఆయనను చూసి ఎలా ఎదగాలో ఇన్ స్పైర్ అవమని మా పిల్లలకు చెబుతుంటా. ఇవాళ ఈ బేబీ సినిమా సక్సెస్ చూసి అతిథిగా వచ్చి ప్రోత్సాహం అందిస్తున్నారు. దీని వల్ల ఇలాంటి మంచి సినిమాలు చేసే ఇంకొంత మంది మేకర్స్ కు అల్లు అర్జున్ లా సపోర్ట్ దొరుకుతుందనే ఆశ ఏర్పడుతుంది. అన్నారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – మా బన్నీనే మాకు అన్నీ. మా కెరీర్ బిగిన్ అయ్యిందే ఆయన సపోర్ట్ తో. నేను జర్నలిస్ట్ గా, పీఆర్వోగా పనిచేసి, ఈరోజుల్లో , బస్టాప్ చిత్రాలతో ప్రొడక్షన్ లోకి వచ్చాను. మా వాసు, మారుతితో కలిసి సినిమాలు చేస్తూ కో ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్నాను. అయితే నేను ఇండస్ట్రీలో ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం లేదు. ఈ బేబీ నాకు ఆ సమాధానం ఇచ్చింది. నాకే కాదు మా టీమ్ లోని చాలా మందికి లైఫ్ ఇచ్చింది. మా మూడేళ్ల కష్టానికి ఫలితం ఇచ్చింది. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు ఇల్లు కూడా అమ్మేశా. నేను ఈ సినిమాను నమ్మాను అంతే. ఇవాళ మా సినిమా అని అల్లు అర్జున్ రాలేదు. ఒక మంచి సినిమా ఎవరు చేసినా ఆయన సపోర్ట్ ఇస్తారు. అల్లు అర్జున్ గారు సినిమాను లవ్ చేస్తారు కాబట్టే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అని అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ – బేబీ సినిమా టోటల్ టీమ్ కు నా కంగ్రాంట్స్ చెబుతున్నా. సినిమాను చించేశారు. 7జీ బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాలే ప్రేమలోని బాధను తెలియజేస్తాయి. అలాంటి సినిమాలు తీయడం కష్టం. ఎందుకంటే అలాంటి లవ్ పెయిన్ చూపించే కథలు సులువుగా రావు. మన జీవితంలో చూస్తేనే, అనుభూతి చెందితేనే వస్తాయి. లైఫ్ నుంచి స్పూర్తి పొందితేనే బేబీ లాంటి సినిమా తీయగలం. ఒకరోజు బేబీ ఫస్ట్ హాఫ్, మరో రోజు సెకండాఫ్ చూశా. సినిమా పూర్తయ్యాక సిక్సర్ కొట్టారు అనిపించింది.
ఈ సినిమా గురించి గంట సేపు చెప్పగలను. ఇందులో చాలా అంశాలు నచ్చాయి. సినిమా రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పర్మార్మెన్సులు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. వీళ్ల పర్మార్మెన్స్ చూసి షాక్ అయ్యాను. వారి నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. చిన్నసినిమాలు థియేటర్ లో ప్రేక్షకులు చూడటం లేదు అనేది అబద్ధం. సినిమా బాగుంటే మీడియా, ప్రేక్షకులు నిజాయతీగా మద్దతు, ప్రేమ ఇస్తారు, అందుకు బేబీ సక్సెస్ నిదర్శనం. ఒక తల్లి బేబీని కనడానికి ఎంత కష్టపడుతుందో ఈ బేబీ సినిమా మేకింగ్ కోసం డైరెక్టర్ సాయిరాజేశ్ అంత కష్టపడ్డాడు. సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు, అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిరాజేశ్. కలర్ ఫొటో సినిమా చూసినప్పుడే అతను మంచి దర్శకుడు అనిపించింది.
సాయిరాజేశ్ స్క్రిప్ట్ రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్..ఇలా అందరూ పాత్రల్లో జీవించారు. నాకు పర్సనల్ గా ఇలాంటి కథలు ఇష్టం. అందుకే బేబీ నచ్చిందేమో. ఈ సినిమా మీద ఆనంద్ పెట్టుకున్న నమ్మకమే ఈ సక్సెస్. విరాజ్ చాలా క్యూట్ గా ఉన్నాడు. చాలా బాగా డీసెంట్ నటించాడు. అవార్డుల ఫంక్షన్స్ లో మన హీరోయిన్స్ కనిపించక బాధనిపించేది. ఇవాళ మన తెలుగమ్మాయి వైష్ణవి హిట్ కొట్టడం సంతోషంగా ఉంది. అని చెప్పారు.