Thursday, January 23, 2025

భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పట్టణంలోని రంగంపల్లి వద్ద గల జాతీయ రహదారిపై వివిధ వార్డుల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను చైర్మెన్ దాసరి మమత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు రోజులగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కూలిపోయేందుకు సిద్దంగా ఉన్న ఇండ్లలో ఉన్న ఇంటి యజమానులకు ఇది వరకే ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, వారిని పరామర్శించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. పాఠశాలలకు సెలవుల కారణంగా పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని, కరెంటు స్థంభాలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 9988556162 నెంబర్‌లో సంప్రదించాలని అన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు గాదె మాదవి, సరేష్‌బాబు, షాహిద సాబీర్ ఖాన్, కొలిపాక శ్రీనివాస్, భూతగడ్డ సంపత్, మున్సిపల్ మేనేజర్ శివ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మహేందర్, జూనియర్ అసిస్టెంట్ ఆరెపల్లి సురేందర్, సానిటరి ఇన్‌స్పెక్టర్ రామ్‌మోహన్ రెడ్డి, సదానందం, మున్సిపల్ సిబ్బంది సతీష్, శంకర్, భూమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News