Monday, December 23, 2024

ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: భూగర్భ గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని, విద్యుత్ ప్రమాదాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎలక్ట్రికల్ డిఎంఎస్ బిశ్వనాథ్ బెహెరా సూచించారు. సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని ఇల్లందు క్లబ్‌లో భూగర్భ, ఉపరితల గనుల్లో విద్యుత్ సరఫరా, నిర్వహణ, భద్రత చర్యలపై రామగుండం రీజియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక రోజు సమీక్ష నిర్వహించారు.

సమావేశానికి సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్‌వికె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమీక్షలోఎలక్ట్రికల్ డిఎంఎస్ బిశ్వనాథ్ బెహెరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా సింగరేణి డైరెక్టర్ పిఅండ్‌పి జి.వెంకటేశ్వర్లు, రక్షణ జిఎం గురవయ్య, జిఎం ఇఅండ్‌ఎం ఎన్.నాగేశ్వర్ రావు సమీక్షలో అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా గని ప్రమాదాలలో మరణించిన వారికి మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ డిఎంఎస్ భూగర్భ, ఉపరితల గనులలో విద్యుత్ వలన జరిగే ప్రమాదాల, వాటి కోసం తీసుకుంటున్న రక్షణ చర్యలపై చర్చించారు. అనంతరం డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్‌వికె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్‌కు సంబంధించిన రక్షణ చర్యలపై తీసుకుంటున్న ప్రమాదాల నియంత్ర చర్యలపై ప్రధానంగా 6 అంవాలు తెలిపారు. ఇవి విద్యుత్ ప్రమాదాల నియంత్రణలో ముఖ్యమైందని చెప్పారు. ప్రమాదాల నివారణకు చేపడుతున్న రక్షణ చర్యలపై వివరించారు.

కార్యక్రమంలో రామగుండం రీజియన్ జిఎంలు, బానోతు సైదులు, ఎ.మనోహర్, సుధాకర్, సేఫ్టీ జిఎం ఎస్.సాంబయ్య, ఎస్‌ఓటూజిఎం రాంమోహన్, రక్షణాధికారి బండి సత్యనారాయణ, ఇఅండ్‌ఎం ఎజిఎం రాంమ్మూర్తి, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సూజర్ వైజర్లు, వర్క్‌షాప్, సిఎస్‌పి, ఓపెన్ కాస్ట్ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన శాఖాధిపతులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూప్ ఇంజనీర్స్, ఫిట్ ఇంజనీర్లు, అధికారులు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News