Saturday, November 23, 2024

ఫైనల్లో భారత యువ జట్టు..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఎమిర్జింగ్ ఆసియా కప్‌లో భారతఎ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తోఎతో జరిగిన రెండో సెమీ ఫైనల్ భారత యువ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ఎ టీమ్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. ఆదివారం కొలంబోలో జరిగే ఫైనల్లో భారత్‌పాకిస్థాన్ టీమ్‌లు తలపడుతాయి. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 34.2 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మహ్మద్ నయీం, తంజీద్ హసన్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన నయీం ఆరు ఫోర్లతో 38 పరుగులు చేశాడు.తంజీద్ హసన్ 8 బౌండరీలతో 51 పరుగులు సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు.

వరుస క్రమంలో వికెట్లను తీస్తూ బంగ్లాదేశ్ బ్యాటర్లను ఇంటిదారి చూపించారు. కెప్టెన్ సైఫ్ హసన్ (22), మహ్మదుల్ హసన్ (20), మెహదీ హసన్ (12) తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దీంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో నిశాంత్ సింధు 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్ మూడు వికెట్లను తీసి తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో బంగ్లా బౌలర్లు సఫలమయ్యారు. భారత జట్టులో ఓపెనర్లు సాయి సుదర్శన్ (21), అభిషేక్ శర్మ (34) పరుగులు చేశారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధుల్ (66) పరుగులు సాధించాడు. అయితే ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 211 పరుగుల వద్దే ముగిసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, తంజీమ్ హసన్, రకిబుల్ హసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News