సిటిబ్యూరోః జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లోకి దూరి గర్భవతి మెడపై కత్తి పెట్టి రూ.10లక్షలు దోచుకున్న నిందితుడు సికింద్రాబాద్‌లో ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్ యాదవ్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బెట్టింగ్‌కు బానిసగా మారిన నిందితుడు డబ్బులకు ఇబ్బంది ఏర్పడినప్పటి నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి వారిని నిర్భందించాడు. పైఅంతస్థులో ఉన్న గర్భవతిని బంధించాడు, వెంటనే తనకు 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తెలిసిన వారి వద్ద డబ్బులు తీసుకుని రూ.10లక్షలు ఇచ్చారు.
వాటిని తీసుకుని అక్కడి నుంచి పరారైన నిందితుడు శంషాబాద్‌లో క్యాబ్ దిగి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి రాజేష్ యాదవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన రాజేష్ యాదవ్ చోరీ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయంతో తన పరువు పొయిందని భావించిన నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రాంగోపాల్‌పేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని వారికి రాజేష్ మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.