Monday, December 23, 2024

రైలు ఇంజన్‌పైకి ఎక్కిన వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

తాండూరు : రైలు ఇంజన్‌పైకి వృద్ధుడు ఎక్కి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం హుస్సేన్ సాగర్ రైలు వచ్చి నిలబడింది. కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (60) మతిస్థిమితం సరిగాలేకపోవడంతో రైలు ఇంజన్ ఎక్కాడు. అంతలోనే పైనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకోబోయి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తీవ్రగాయాలైన చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో చూసిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News