Monday, January 20, 2025

25 మంది డిఎస్పీల బదిలీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 25 మంది డిఎస్పీ(సివిల్)లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెయిటింగ్‌లో ఉన్న కె.శివరామ రెడ్డి రాచకొండ యాదాద్రి ఎసిపిగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ కె.వెంకటయ్య సైబరాబాద్ కూకట్‌పల్లి ట్రాఫిక్ ఎసిపిగా నియమితులయ్యారు. సైబరాబాద్ కూకట్‌పల్లి ట్రాఫిక్ ఎసిపి డి.ధనలక్ష్మిని హైదరాబాద్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ కె.చంద్రశేఖర్‌రెడ్డి సైబరాబాద్ శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపిగా నియమితులయ్యారు. సైబరాబాద్ శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి పి.శ్రీనివాసనాయుడుని హైదరాబాద్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ కందుల రవి కుమార్ హైదరాబాద్ గాంధీనగర్ ఎసిపిగా నియమితులయ్యారు.

హైదరాబాద్ సిటీ సిటిసి ఎసిపిగా ఉన్న ఎన్.బి.రత్నం హైదరాబాద్ సెంట్రల్ జోన్ ట్రాఫిక్‌-II ఎసిపిగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ ఎన్.ప్రవీందర్‌రావు రాచకొండ మహేశ్వరం ట్రాఫిక్ ఎసిపిగా నియమితులయ్యారు. ఖమ్మం టాస్క్‌ఫోర్స్ ఎసిపి వై.వెంకటేశ్వరరావు హైదరాబాద్ సిటీ ఎస్‌ఆర్ నగర్ ఎసిపిగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ వై.నరసింహారెడ్డి డిఎస్‌ఆర్‌పి, సికింద్రాబాద్ (రూరల్)గా నియమితులయ్యారు. ఎ.శ్రీనివాసులుని ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎస్‌డిపివోగా పునర్నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ హసీబుల్లా సైబరాబాద్ ఇవోడబ్లూ ఎసిపిగా నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ డిఎస్పీ గొల్లా రమేష్ హైదరాబాద్ సిటీ ఛత్రినాక(ఫలక్‌నుమా) ఎసిపిగా నియమితులయ్యారు. ఎసిపి టి.కరుణాకర్‌రావు కరీంనగర్ రూరల్ ఎసిపిగా పునర్నియమించారు. రాచకొండ ఎస్వోటీ ఎసిపి డి.వెంకన్న నాయక్ హైదరాబాద్ సిటీ సైదాబాద్ ఎసిపిగా నియమితులయ్యారు.

హైదరాబాద్ సిటీ సిటిసి ఎసిపి కె.మనోజ్‌కుమార్ హైదరాబాద్ సిటీ చాంద్రాయణగుట్ట ఎసిపిగా నియమితులయ్యారు. ఎసిపి కె.పూర్ణచంద్రరావు హైదరాబాద్ సిటీ సెక్రటేరియేట్ సెక్యూరిటీ ఎసిపిగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ జి.వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్ సిటీ సిసిఎస్‌అండ్‌డిడి ఎసిపిగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ పి.బలరామిరెడ్డి సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ ఎస్.రంగనాథ్ సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ బి.యాదగిరి స్వామి సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ ఎస్.మదన్‌మోహన్‌రెడ్డి సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ వి.సంపత్ సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ జి.వెంకటేశ్వర్లు సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో వున్న కె.రవీందర్‌రెడ్డి సిఐడి డిఎస్పీగా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News