Monday, December 23, 2024

మాది మాటల ప్రభుత్వం కాదు…చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: లింగంపల్లి అండర్ బ్రిడ్జి సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. వర్షాలు పడినప్పుడు లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండిపోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహనదారులకు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతామని అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ధ నీరు నిలిచిపోవడంతో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన శుక్రవారం సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారాం దిశగా మూడు కోట్ల నిధులతో త్వరలోనే పనులు చేపడుతామని అన్నారు. మూడు కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని నిధులు మంజూరు కాగానే పనులు త్వరగా చేపట్టి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో చర్చించడం జరిగిందని, సాంకేతిక కారణాలతో, మంజీర పైప్‌లైన్ ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని సర్వేలు చేపట్టి పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను, నీరునిల్వ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడ సమస్యలు ఉన్న అక్కడికి చేరుకొని వాటి పరిష్కారానికి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని మాన్‌సూన్, ఎమర్జెన్సీ టీములు సన్నద్ధం కావాలని, అదేవిధంగా లింగంపల్లి అండర్ బ్రిడ్జి కింద చెత్తచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కెటిఆర్ సహకారంతో శేరిలింగంపల్లిలో అనేకరోడ్లు, లింక్ రోడ్లు, ఫ్ల్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు, నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాపిక్ రహిత సమాజం కోసం కృషి చేశామని ఆయన అన్నారు.

గతంలో వర్షాలు పడితే శేరిలింగంపల్లిలో దీప్తి శ్రీనగర్, ధరణి నగర్, మాదాపూర్ సిటివైన్స్ వద్ద నాలాలోపై నిత్యం వార్తలు వచ్చేవి అని నేడు ఒక్క వార్త రాలేదు అంటే మా నిబద్ధతతో పనిచేస్తున్నమని అర్థమని అన్నారు. అదేవిధంగా లింగంపల్లి అండర్ బ్రిడ్జి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఎస్‌ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, ఈఈ శ్రీకాంతిని, డీఈ రమేష్, ఏఈ సునీల్, ఏఈ జగదీష్, ఏఈ సంతోష్ రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, చందానగర డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుప్రజ ప్రవీణ్, పద్మారావు, చింతకింది రవీందర్ గౌడ్, నటరాజు, గంగారాం యాదవ్, నర్సింహ రెడ్డి, గిరి, అప్సర్, దివ్య, నిరూప పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News