- Advertisement -
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌లైన్ గోఫస్ట్‌కు విమానాలను తిరిగి ప్రారంభించేందుకు షరతులతో ఆమోదం లభించింది. విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం గోఫస్ట్‌కు అనుమతి మంజూరు చేసింది.
ఢిల్లీ హైకోర్టు, ఎన్‌సిఎల్‌టిలో కేసు పురోగతి ఆధారంగా గోఫస్ట్ ఎయిర్‌లైన్ తన కార్యకలాపాలను ప్రారంభించవచ్చని డిజిసిఎ వెల్లడించింది. నగదు కొరత కారణంగా మే 3 నుండి గోఫస్ట్ విమానాలను నడపడం లేదు. విమానయాన సంస్థ తన పునఃప్రారంభ ప్రణాళికను జూన్ 28న ఏవియేషన్ రెగ్యులేటర్‌కు సమర్పించింది. పరిశీలించిన తర్వాత డిజిసిఎ ఆమోదం తెలిపింది.
- Advertisement -