గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోగల దీన్ దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌పై అఖిల్ భారతీయ విద్యార్థి పరిషద్(ఎబివిపి) సభ్యులు శుక్రవారం దాడి చేశారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా ఎబివిపి సభ్యులు దాడి చేశారు.
ఫీజుల పెంపుదలను వ్యతిరేకించడంతోపాటు ఇతర డిమాండ్లను తెలియచేసూ్త ఉదయం నుంచి యూనివర్సిటీ గేటు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న అధికార బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి సభ్యులను కలుసుకోవడానికి యూనివర్సిటీ పాలక సభ్యులు నిరాకరించారు. దీంతో ఆగ్రహోదగ్రులైన ఎబివిపి సభ్యులు విసి కార్యాలయంలోకి ప్రవేశించి విధ్యంసం సృష్టించారు. అడ్డు వచ్చిన స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యుటీ డీన్‌తోపాటు కొందరు ప్రొఫెసర్లపై దాడికి తెగబడ్డారు. విసి కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు తలుపులను పగలగొట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన యూనివర్సిటీ చేరుకున్నారు. పరిస్థితిని అదుపుచేయడానికి ప్రయత్నించిన పోలీసులపై ఎబివిపి సభ్యులతోపాటు కొందరు ఉద్యోగులు కూడా తలపడ్డారు. ఈ పరిస్థితిలో పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురు ఎబివిపి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ పాలనా యంత్రాంగం అవినీతికి, అక్రమాలకు పాల్పడుతోందని కొందరు ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించిన నేపథ్యంలో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Members of BJP's youth wing ABVP protesting against fee hike and other demands at UP's Gorakhpur University confronted the VC Prof Rajesh Singh who was moving around with cops in security. A scuffle followed with ABVP members and cops exchanging fist blows. pic.twitter.com/YgJh5rDzsR
— Piyush Rai (@Benarasiyaa) July 21, 2023