ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను మూకలు నగ్నంగా ఊరేగిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో జులై 19న వెలుగు చూసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఐదవ నిందితుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 19 ఏళ్ల ఒక యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టులో శుక్రవారం హాజరుపరచగా వారికి 11 రోజుల పోలీసు కస్టడీ విధించినట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఏడాది మే 4వ తేదీన కంగ్‌పోక్‌పీ జిల్లాలోని ఫైనోమ్ గ్రామంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన 26 సెకండ్ల వీడియో జులై 19న వెలుగు చూడగా గురువారం నుంచి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఊదవ నిందితుడు శనివారం అరెస్టు అయ్యాడు. ఈ కేసులోని ప్రధాన నిందితులలో ఒకడి ఇంటిని గురువారం మహిళలు తగలబెట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలో ఈ నిందితుడు ప్రధానంగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
బాధిత మహిళల్లో ఒకరు కార్గిల్ యుద్ధంలో అస్సాం రెజిమెంట్ కు చెందిన సుబేదార్ పోస్టులో భారతీయ సైన్యం తరఫున పోరాడిన మాజీ సైనికుడి భార్య అన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వైరల్ వీడియోకు సంబంధించి జూన్ 21న కంగ్‌పోక్‌పీ జిల్లాలోని సైకుల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నదుకావడం గమనార్హం. మే 3వ తేదీన మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి. మణిపూర్ మొత్తం జనాభాలో లోయలో నివసించే మీటీల జనాభా 53 శాతం ఉంటుంది. పర్వత ప్రాంతాలలో నివసిచే నాగాలు, కుకీలతో కూడిన గిరిజనుల సనాభా 40 శాతం ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన అనాగరిక, అమానవీయ దాడి ఘటనను యునైటెడ్ నాగా కౌన్సిల్, ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్‌తోసహా అనేక నాగా పౌర సమాజ సంఘాలు ఖండించాయి. బాధిత మహిళలకు సత్వర న్యాయం అందచేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని యునైటెడ్ నాగా కౌన్సిల్ డిమాండ్ చేసిది.
Five arrested so far in viral video case.
As regard to the viral video of 02 (two) women paraded by unknown miscreants on 4th May, 2023, another accused was arrested today.
1/2
— Manipur Police (@manipur_police) July 22, 2023