Saturday, November 23, 2024

పరవళ్లు తొక్కుతున్న బాసర గోదావరి

- Advertisement -
- Advertisement -

బాసర : పవిత్ర పుణ్య గోదావరి నది మహారాష్ట్రలోని తంబేశ్వరులో పుట్టి అక్కడి దాదాపు 12 ప్రాజెక్టులు గోదావరి వరద నీరు చేరుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సమీపాన ఉన్న బాబ్లీ ప్రాజెక్టులో అదేవిధంగా ప్రాజెక్టులలో వరద నీరు చేరడంతో అక్కడి నుండి గేట్లు ఎత్తివేయగా బాసర గోదావరి వరద నీరు చేరి పరవళ్లు తొక్కుతుంది.

ఇటీవల మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో అక్కడక్కడ నాలుగు రోజుల నుండి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, గోదావరి నదిలో వరద నీరు చేరడంతో గోదావరి నది రెండు ఘాట్లలో నీరు సమానంతో ప్రవహిస్తు దిగువ భాగంలో ఉన్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో చేరుతుంది. ఇప్పటికే గోదావరిలో మహారాష్ట్ర నుంచి వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో గోదావరి నదికి జలకళ సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు సూచనల మేరకు గోదావరి నదిలోకి ఎవరు వెళ్లకుండా చూడాలని అదేవిధంగా జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. గోదావరి నదికి సమీపాన గల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News