Friday, November 15, 2024

మంజీరాకు తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి

- Advertisement -
- Advertisement -

బోధన్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మంజీరాకు వరుద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో శనివారం ఉదయం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. నూతన బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో నైజాములు నిర్మించిన వంతెనపై నుంచి గత సంవత్సరం నుంచి రాకపోకలు సాగుతున్నాయి. పాత వంతెనపై నుంచి గత రెండు రోజుల నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రెండు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.

మంజీరాకు వరద ఉదృతి కొద్దిపాటిగా మాత్రమే తగ్గడంతో అధికారులు పాత వంతెన నుంచి ప్రయాణం సాగించవద్దని హెచ్చరికలు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం వారు వెల్లడించిన విషయం తెలిసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మంజీరాకు వరద ఉదృతి తగ్గినప్పటికి పాత వంతెనకు తగులుతూ ప్రవహించడం వలన ప్రమాదపు టంచులు పొంచి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News