Monday, January 20, 2025

ప్రజలు ఇంటి వద్ద నుంచి కచ్చితంగా స్టీల్ డబ్బాలను వెంటనే తెచ్చుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట: ప్రజలు ఇంటి వ ద్ద నుంచి కచ్చితంగా స్టీల్ డబ్బాలను వెంటనే తెచ్చుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజన ర్సు అన్నారు. శనివారం పట్టణంలోని 28వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, వార్డు కౌన్సిలర్ మల్లికార్జున్, పర్యావరణ ప్రేమికురాలు శాంతితో కలిసి వార్డులో నడుస్తూ చెత్తట వేరు చేయుట కార్యక్రమంలో భాగంగా చెత్తను ఏరి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో పలు యూజీడి మ్యాన్ హోల్స్ చాంబర్‌పై మూతలు సరిగ్గా లేకపోవడంతో పబ్లిక్ హెల్త్ ఎఈని పిలిచి మ్యాన్ హోల్స్ మూతలు సక్రమంగా పెట్టాలన్నారు.

బీహర్ కూలీలతో ప్రమాణం

వార్డు పర్యటనలో భాగంగా బీహార్ నుండి సిద్దిపేట పట్టణానికి భవన నిర్మాణ రంగాలలో పని నిమిత్తం వలస వచ్చిన బీహార్ కూలీలు వారు ఉన్నటువంటి ప్రదేశాలలో వేసినటువంటి చెత్తను గమనించి పట్టణ ంలో ఎవరు కూడా ఆరు బయట చెత్త వేయరని మీరు గుట్కాలు వేసుకొని ఎక్కడబడితే అక్కడ ఉమ్మడం వ లన పరిసరాలు ఆపరిశుభ్రం అయి దాని వలన మీ ఆరోగ్యమే కాక చుట్టు ప్రక్కల ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెప్పారు. కార్మికులకుల తడి , పొడి, హానికరమైన చెత్త వేరు చేయుట పట్ల అవగాహన కల్పించి చెత్తను కేవలం మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించే విధంగా వారితో ప్రమాణం చేపించారు. మరోక సారి చెత్త ఆరుబయ ట వేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందన్నా రు. వార్డు ప్రజలందరితో మమేకమై ఆప్యాయంగా మాట్లాడుతూ కౌన్సిలర్ పనితీరు గురించి ఆరా తీశారు. వార్డులో కలియతిరుగుతూ హోటల్‌లను తనిఖీ చేశారు. పట్టణ ప్రజలకు ప్రతి రోజు ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన ఇస్తున్న కూడా హోటల్ యజమానులు ప్లాస్టిక్ వాడకం పట్ల తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News