Saturday, November 23, 2024

జిహెచ్‌ఎంసి అప్రమత్తతతో ఉంది: మేయర్

- Advertisement -
- Advertisement -

ఏలాంటి భయాందోళనలు అవసరం లేదు.
నగరవాసులకు మేయర్ భరోసా..

మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల నేపథ్యంలో నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్‌ఎంసి పూర్తి అప్రమత్తంగా ఉందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రజలు ఏలాంటి భయాందోళనలకు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మేయర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ నగరవాసుల నుండి అందిన ఫిర్యాదుల పరిష్కారంపై ఆరా తీశారు.

Also Read: యుసిసి ఆచరణ సాధ్యమేనా?

అనంతరం మేయర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిహెచ్‌ఎంసి ద్వారా ఏర్పాటు చేసిన 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల తోఅధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని మేయర్ తెలిపారు.ఈ 428 బృందాల తో పాటు డి.ఆర్.ఎఫ్ 30 బృందాలు కూడా 24 గంటల పాటు రాత్రింబవళ్లు తేడా లేకుండా అహర్నిశలు కష్టపడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా విశేష కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని మేయర్ కోరారు.నగరంలో వర్షాల కారణంగా గత 4 రోజులుగా నీటి నిల్వలకు సంబంధించి మొత్తం 946 ఫిర్యాదులు అందగా వాటిని పరిష్కారించినట్లు మేయర్ వెల్లడించారు. అదే విధంగా 107 చెట్లు పడిపోగా చెట్లను తొలగించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న 5 గోడలు పడపోయినట్లు పిర్యాదులు అందగా వాటిని పరిష్కరించామని చెప్పారు.

అంతేకాకుండలింగోజిగూడ, హిమాయత్ నగర్,ఆదర్శ్ నగర్ (స్ట్రీట్ నెం .14), ఎన్.టి.ఆర్ నగర్, అల్తాఫ్ నగర్ కాలనీ లలో నీరు రావడంతో వీటిని డిఆర్‌ఎఫ్ బృందాలు తొలగించాన్నారు. నగరంలో కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న గృహాలనుగుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కృషి చేశారనితెలిపారు..ఇప్పటి వరకు 483 గృహాలు గుర్తించగా అందులో 87 గృహాలు కూల్చివేయగా గృహ యజమానులు కోరిక మేరకు 92 మరమ్మత్తులకు అనుమతిచ్చామని, మరో 135 గృహాలను ఖాళీ చేయించడంతో పాటు . 19 గృహాలు సీజ్ చేయగామరో 150 గృహాలు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు.

నగర పరిధిలో ఎస్ ఎన్ డి పీ ద్వారారూ. 780 కోట్ల వ్యయంతో 36 పనులు చేపట్టగా అందులో 30 పనులు పూర్తయ్యాయి.ఎస్ ఎన్ డి పీ ద్వారా పూర్తయిన ప్రాంతాల్లో ఎలాంటి వరద ముంపు లేకుండా పోయిందని మిగతా 6 పనులను త్వరలో పూర్తిచేస్తామన్నారు.గతంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎప్పుడు జలమయమయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.వర్షాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి 24 గంటలపాటుపని చేస్తుందనితెలిపారు. రోడ్డు పై పడిన గుంతలను ప్రధాన రోడ్లపై సి.ఆర్.ఎం.పికాంట్రాక్టర్, మిగతా చోట్ల జిహెచ్‌ఎంసి సిబ్బంది పూడ్చుతున్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News