Monday, December 23, 2024

కెటిఆర్ జన్మదినాన ‘ట్రై క్రీడా వేడుకలు’

- Advertisement -
- Advertisement -
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్‌తో కలిసి పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న యువనేత, డైనమిక్ లీడర్ ,ఐటీ, పారిశ్రామిక, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలను శాట్స్ , క్రీడా అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాట్స్ సహకారం తో క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాద్ లో ‘ట్రై క్రీడా వేడుకలు’ నిర్వహిస్తున్నామన్నారు. కెటిఆర్ జన్మదిన సంధర్భంగా శనివారం రవీంద్ర భారతిలో ఈ మేరకు శాట్స్, క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ట్రై క్రీడా వేడుకలు-2023’ పోస్టర్, బ్రోచర్‌లను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి తో పాటు అనేక ప్రతిష్టాత్మక ప్రైవేటు పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు కావడం వెనుక మంత్రి కెటిఆర్ నిరంతర కృషే కారణమని అన్నారు. దీని వల్ల ప్రైవేటు రంగంలో యువతకు లక్షల ఉద్యోగావకాశాలు లభించాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం కెసిఆర్, కెటిఆర్‌లు నిరంతరం శ్రమించడం వల్లే , రాష్ట్రం అన్ని రంగాల్లో ఘణ విజయాలు సాధించిందన్నారు. వీరి స్పూర్తి ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొనిపోవడానికి ‘స్పోర్ట్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్’ నినాదం తో కెటిఆర్ జన్మదినమైన ఈనెల 24న ట్రై క్రీడా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.

నెక్లెస్ రోడ్ లో సైక్లింగ్, ఇందిరా పార్కు లో స్కేటింగ్, యూసుఫ్ గూడ స్టేడియంలో రెజ్లింగ్ క్రీడా పోటీలు జరగనున్నాయని, భారీగా క్రీడా కారులు,కెటిఆర్ అభిమానులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్, ప్రేమ్ రాజ్ , గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, వివిధ క్రీడా అసోసియేషన్‌ల ప్రతినిధులు మర్రి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, దత్తాత్రేయ, నర్సింగ్ ,నిర్మల్ సింగ్, గోకుల్ కోచ్‌లు,క్రీడా అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News