Saturday, November 16, 2024

మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలి : ఉద్ధవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

ముంబై : మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రం లోని బీజేపీ ప్రభుత్వాలపై శివసేన (యూబీటీ) అధినేత , మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్ థాక్రే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మణిపూర్‌లో దారుణాలపై మణిపూర్ ఫైల్స్ పేరున సినిమా తీయాలన్నారు. కశ్మీర్‌లో కంటే మణిపూర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మణిపూర్ ఘటనను సుప్రీం కోర్టు పరిగణన లోకి తీసుకోక పోయి ఉంటే , ప్రధాని మోడీ నోరు మెదిపేవారు కాదని శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో వివరించింది. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ పేరుతో సినిమాలు తీశారని, ఇప్పుడు వారు మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలని సూచించింది. మణిపూర్‌లో కనుక బీజేపీయేతర ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేవారని వ్యాఖ్యానించింది. రాజకీయంగా ప్రధాని మోడీకి మణిపూర్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, అందుకే అక్కడి ఘర్షణలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News