Thursday, January 23, 2025

ఇలా ఆడితే రహానెకు కష్టమే: వసీం జాఫర్

- Advertisement -
- Advertisement -

ముంబై: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అజింక్య రహానె విఫలమయ్యాడని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. విండీస్ సిరీస్ రహానెకు చాలా కీలకమని అయితే అతను మాత్రం వరుసగా రెండు సార్లు తక్కువ స్కోరుకే విపలమై నిరాశ పరిచాడన్నాడు. ఈ వైఫల్యం రహానెకు ప్రతికూలంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. తొలి టెస్టుతో రెండో మ్యాచ్‌లోనూ రహానె తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడడం తనను బాధకు గురి చేసిందన్నాడు. డబ్లూటిసి ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేసిన రహానెపై జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకుందన్నాడు. అయితే అతను మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆడే ఛాన్స్ దొరికితే బ్యాట్‌ను ఝులిపించాల్సిన బాధ్యత రహానెపై ఉందన్నాడు. ఈసారి కూడా విఫలమైతే జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని జాఫర్ పేర్కొన్నారు.

Also Read: అమ్మ కోసం దుబాయ్ నుంచి సూట్‌కేసులో టమాటాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News