Monday, November 18, 2024

వయస్సుతో సంబంధం లేకుండా న్యూరలాజికల్ సమస్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ న్యూరలా-జికల్ సమస్యలు తలెత్తుతున్నాయని విరంచి ఆసుపత్రి సీఈవో డా. సాయి రవి శంకర్ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వాటికి సరైన సమయంలో నిర్థారించకపోయినట్లయితే విపరీత పరిణామాలకు దారి తీయవచ్చని అందుకోసం ఇలాంటి వాటిపై ప్రజలు అవగాహన కలిపించుకోవాలని సూచించారు. నేటి జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా అల్జీమర్స్, పార్కిన్సనిస లాంటి పలు రకములైన డెమన్షియా రకపు రుగ్మతలతో భాదపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని వివరించారు. అందుకే ఆరోగ్య రంగంలో పని చేసే వారే కాకుండా సామాన్య ప్రజల కోసం పని చేసే స్వచ్చంద సంస్థలు కూడా ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి పని చేయాలని సూచించారు చేశారు.

మెదడు కు సంబంధించిన పలు అంశాలపై ప్రపంచ ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఏటా ఈ ప్రపంచ మెదడు దినోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆసుపత్రి న్యూరాలజీ విభాగపు వైద్యులు హాస్పిటల్ సిబ్బందికి పలు మెదడు కు సంబంధించిన రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మెదడుకు చురుకుదనం కలిగించే రీతిలో హాస్పిటల్ వైద్యులకు ప్రత్యేక క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్విజ్ కార్యక్రమంలో వైద్యల మెదడుకు పని కలిపించే రీతిలో పలు ప్రశ్నలను క్విజ్ మాస్టర్ సంధించగా వాటికి వైద్యులు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో వి సత్యనారాయణ, డా. యం ఆర్ సి నాయడు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, విరించి హాస్పిటల్స్ తో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News