Tuesday, December 24, 2024

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : న్యాయస్థానాల్లో పెండిం గ్ ఉన్న కేసులను సత్వరమే పరి ష్కరించి న్యాయం చేయాలని ప్రిన్సి పల్ జిల్లా, సెషన్ కోర్టు న్యాయ మూర్తి డి. రాజేష్ బాబు అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయ విభాగానికి సంబంధించిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న కేసులు ఎందుకు సమయానుకూలంగా పరి ష్కరించలేకపోతున్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను, సూచనలను తెలిపారు.

న్యాయస్థానాల్లో నాన్ బెయిల్ వారంట్లను తక్షణం అమలు చేసి సాక్షులను సంబంధిత న్యాయస్థానాల్లో హాజరు పరచాలని, పోలీస్ అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూట ర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబితా, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, మౌనిక, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసికూటర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News