అబ్దుల్లాపూర్‌మెట్: మహిళలు స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రా మంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం రంగారెడ్డి జిల్లా, గీతాచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణా, కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన అబ్దుల్లాపూర్‌మెట్, బాటసింగారం, బం డరావిరాల గ్రామాల కుంట్లూర్JI చెందిన 140మంది మహిళలకు కుట్టు మిషన్లను, సర్టిఫికేట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విటల్ రెడ్డి, పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ చామా సంపూర్ణ రెడ్డి, కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్, సర్పంచులు చెరుకు కిరణ్ కు మార్ గౌడ్, ఎర్రవల్లి లత గౌరీ శంకర్, కవాడి శ్రీనివాస్ రెడ్డి, పో చంపల్లి సుధాకర్ రెడ్డి, కుర్ర లావణ్య రాధాకృష్ణ, ఎంపీటీసీలు దం తూరి అనిత మహేందర్ గౌడ్, గ్యార బాల లింగస్వామి, టిఆర్‌ఎస్ నాయకులు కొత్త కిషన్ గౌడ్, పూజారి చక్రవర్తి గౌడ్, కోటా లక్ష్మారెడ్డి, మొగుళ్ల జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.