- Advertisement -
హైదరాబాద్: గోదావరికి వరద ఉధృతి పెరుగుతోందని విపత్తుల సంస్థ తెలిపింది. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పోలవరం స్పిల్ వే వద్ద 32.040 మీటర్లకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు ఉంది. ధవలేశ్వరం వద్ద ఉధృతి పెరిగే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 43.4 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: అమ్మ కోసం దుబాయ్ నుంచి సూట్‌కేసులో టమాటాలు
- Advertisement -