Saturday, December 21, 2024

కోళ్ల ఎగుమతికి కేంద్రం సహాయం

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : కోళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విదంగా కేంద్రం సహాయం అందిస్తుందని కేంద్ర మత్స పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. బిక్కనూర్ మండలంలోని కాచాపూర్ గ్రామ శివారులో ఉన్న కేజి యల్ కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఆదివారం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సందర్శించారు.

అత్యాధునిక సౌకర్యాలతో, టెక్నాలజీతో నడుస్తున్న కోళ్ల పరిశ్రమ గురించి కేజియల్ కంపెని యజమానులతో అడిగి తెలుసుకున్నారు. ఇతర దేశాలలో నాన్ జెనిటిక్ వాడుతున్నామని కానీ ఇక్కడ కోళ్లకు జిఎం జెనిటిక్ మెజ్ దానాగా వాడటం వలన కోడి నాణ్యత రుచి కలిగి ఉంటుందని కంపనీ యజమాని డాక్టర్ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. కేజియల్ కంపనీ ద్వారా కోళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని కేంద్ర మంత్రి రూపాల అన్నారు.

గత ప్రభుత్వంలో కోళ్లకు ఇంజక్షన్ ద్వారా పెంపొందించే విదానం అధికంగా ఉండేదన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం కోళ్లకు ఇంజక్షన్ ద్వారా కాకుండా ఇతర పద్దతులలో కోళ్లను పెంపొందించే విదంగా కోళ్ల పరిశ్రమలకు చేయూతనంది స్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ సెక్రటరీ జయశ్రీ, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణాతారా, కేజియల్ యేంటినెన్స్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News