Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ల్యాబర్తి గ్రామానికి చెందిన సుమారు 50 మంది బిఎస్పి నాయకలు వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన బిఎస్పి మండల ప్రధాన కార్యదర్శి సూరారపు నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, కాంగ్రెస్ వార్డుసభ్యులు కాకర్ల ఎల్లయ్య, భాజాప నుంచి బుర్ర వెంకన్న, సంజీవ్‌గౌడ్, గణేష్, ప్రశాంత్ వీరితోపాటు 50 మంది ఎమ్మెల్యే ఆరూరి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న బీఆర్‌ఎస్‌లో చేరికలు కొనసాగుతున్నాయన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉండటమే కాకుండా వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News