సూర్యాపేట:రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం రైతులకు ఉచిత కరెంటు పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మోతె మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలివి లేని కాంగ్రెస్ నాయకులు 3గంటలు కరెంటు సరిపోతుందని అంటున్నారని ఆయన అన్నారు.
3 గంటలు కరెంటు అందించే కాంగ్రెస్ కావాలో, 3పంటలకు 24 గంటల ఉచిత కరెంట్ అందిచే బిఆర్‌ఎస్ ప్రభ్వుం కావాలో ఆలోచన చేయండి అని ఆయన కోరారు. ఒకనాడు బ్రతుకుదెరువు కోసం తెలంగాణ వాళ్లు పక్క రాష్ట్రాల కు పోతే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుండి వరి నాట్లు వేయడానికి కార్మికులు వలస వచ్చే స్థితికి తెలంగాణ చేరిందని ఆయన తెలిపారు. 24గంటల కరె ంటు ఇవ్వడం, పెట్టుబడి సాయానికి రైతు బంధు అందించడం, కృష్ణ, గో దావరి బేసిన్ నుండి సాగినీటిని అందించడం కారణంగా సంవత్సరానికి రైతులు మూడు పంటలు పండిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని, కరెంటు కోసం బా వుల దగ్గర రైతులు పడికాపులు కాసే పరిస్థితి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి, ఆ పార్టీ నేతలకు వ్యవసాయ రంగం పైన అవగాహన లేదని, వాళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలౌవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిపి లింగారెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ కొండపల్లి వెంకటరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.