Monday, December 23, 2024

రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌కు ఆప్ లేఖ రాసింది. ఈ బిల్లునుఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, తద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కోరారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఢిల్లీలో పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ మినహా ఇతర పాలనాధికారాలను ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం మే 9 న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News