Monday, November 18, 2024

తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మణిపూర్ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ మణిపూర్‌లో జాతీ వైషమ్యాలు పెచ్చు పెరిగిపోయి, మారణహోమం జరుగుతుంటే మోడీ మణిపూర్ మంటల్లో రాజకీయ చలి కాచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే మణిపూర్ సంఘటనపై ప్రధాని స్పందించి బాధితులకు భరోసా కల్పించాలన్నారు.
ప్రధాని రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించారు: శివసేన రెడ్డి
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్మార్గులను నడిరోడ్డు పై ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న ఘోరం చూస్తుంటే ప్రతి ఒక్క భారతీయుడి గుండె రగులుతుందన్నారు. కేవలం ఆర్ధిక లాభం కోసం కార్పొరేట్ సంస్థలతో చేయి కలిపిన ప్రధాని మోడీ మణిపూర్‌లో మైనింగ్‌కు అనుకూలంగా ఉన్న గిరిజన ప్రాంతాలను అదానీకి కట్టబెట్టే కుట్రలో భాగంగా రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News