- Advertisement -
నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చెయొచ్చునంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువజామున పట్టణ ప్రతీ వార్డులో కలియ తిరుగుతూ ప్రజలకు చెత్తోపదేశం చేస్తున్నది. ఈ మేరకు 18వ వార్డు వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.
మన చెత్త, మన బాధ్యత అంటూ పలు గృహిణీలకు చెత్త పెరుకుపోతే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, కుర్ కురే ప్యాకెట్లు, చాకలెట్ వెఫర్లు, వాటర్ గ్లాసులు, ఛాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను స్వయంగా ఎత్తి సంచిలో వేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను మంత్రి హరీశ్ రావు కోరారు.
- Advertisement -