- Advertisement -
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రెండో టెస్టులోనూ ఆతిధ్య విండీస్ జట్టుపై టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు పేసర్ మహమ్మద్ సిరాజ్ (5/60) చెలరేగడంతో విండీస్ జట్టు 255 పరుగలకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(57), ఇషాన్ కిషన్(52 నాటౌట్)లు అర్థ సెంచరీలతో చెలరేగారు.మరో ఓపెనర్ యషశ్వి జైశ్వల్(38), శుభమన్‌గిల్ (29 నాటౌట్)లు రాణించారు.
దీంతో 365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగుల చేసింది. కాగా, ఐదురోజు విండిస్ విజయానికి మరో 289 పరుగులు కావాల్సి ఉంది.
- Advertisement -