అమరావతి: పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? అని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? అని అడిగారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు సిఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. పేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. తన అక్కచెల్లమ్మలకు 30 లక్షల ఇళ్లు పట్టాలు ఇచ్చామని, కోర్టు కేసులతో దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తిన్నారని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు మాత్రం స్థలం ఇవ్వకూడదని టిడిపోళ్లు అంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కంటే ఇప్పుడే అప్పులు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….
మంచి చేసే కార్యక్రమానికి ప్రతిపక్షాలు అడ్డుతగలడమే లక్షంగా పెట్టుకున్నాయన్నారు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉండో గమనించాలని సూచించారు. పేరుకు రాజధాని కానీ పేదలకు ఇక్కడ చోటు ఉండొద్దా అని ప్రశ్నించారు. సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు ఇస్తే అభివృద్ధి జరగదంటూ వాదిస్తున్నారని చురకలంటించారు. ఇలాంటి పెత్తందారులతో మనం యుద్ధం చేస్తున్నామని వివరించారు. ఇలాంటి దుర్మార్గులను ఇక్కడే చూస్తున్నామని, దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదన్నారు. ఏ సామాజిక వర్గమైనా మరో మెట్టు ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. పేదలకు వ్యతిరేకంగా దిగజారుడు రాతలు రాస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.