Sunday, November 24, 2024

యోగ.. అద్భుతమైన ఔషధం: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: యోగ చేస్తే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం.. క్రమపద్ధతిలో చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుందని, సహజ సిద్ధమైన, అద్భుతమైన ఔషధం యోగ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపాలిటీ 22వ వార్డు శ్రీ చైతన్య స్కూల్ లో యోగ శిక్షకులు తోట సతీశ్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కొనసాగుతున్న ఉచిత ఆనంద యోగ క్యాంపు కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొని 100 మంది సాధకులకు మ్యాట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మితమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని యోగ, ప్రాణాయామం వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలు చెప్పారు.

మా ప్రయత్నం ఆరోగ్య సిద్ధిపేట సాధన యోగాతో సాధ్యమైతుంది. నిరంతరం ఈ యోగ ప్రక్రియ కొనసాగించాలి. ప్రపంచంలోని అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే యోగను అనుసరిస్తున్నాయి. మీ జీవన విధానంలో యోగ ఒక భాగం చేసుకోవాలి. మీ పిల్లలకు సైతం యోగ నేర్పించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.నిత్యం క్యాంపు కార్యాలయంలో యోగ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని, అలాగే పట్టణంలోని వార్డు వారీగా 10 రోజులు ఉచిత యోగ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపట్నుంచి రైస్ మిల్లు అసోసియేషన్ లో ఆనంద యోగ ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ మేరకు యోగ సాధనతో ఏం మార్పులు వచ్చాయని, అనుభవాల గురించి ఒక్కొక్కరితో మాట్లాడి తెలుసు్కున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News