Friday, December 20, 2024

దుండిగల్ లో రోడ్డు ప్రమాదం: మృతదేహం రెండు ముక్కలు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కుత్బుల్లాపూర్ ప్రాంతం దుండిగల్ లోని మల్లంపేట వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  వాటర్ ట్యాంకర్ మహిళను ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలో మృతి చెందింది. మృతదేహం రెండు ముక్కలుగా మారింది. టిఎస్ 01 యుబి 2256 అనే ట్యాంకర్ దుండిగల్ నుంచి శంబీపూర్ వెళ్తుండగా మహిళను ఢీకొట్టడంతో ఆమె రెండు ముక్కలుగా మారింది. ప్రాథమిక దర్యాప్తు లో మృతురాలు ఓక్రజ్డ్ స్కూల్ లో పని చేసే ఆయా కవిత (35)గా భర్త రమేష్ గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భర్త రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News