Friday, December 20, 2024

కాళోజీ ఖ్యాతిని తెలిపేలా నిర్మాణం ఉండాలి: దేశపతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా కవి కాళోజీ నారాయణరావు ఖ్యాతిని తెలిపేలా నిర్మాణo ఉండాలని, కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం పై సిఎం ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై సోమవారం రోజున కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాళోజీ ప్రాముఖ్యత, విశిష్టత చరిత్ర తెలిపేలా నిర్మాణ పనుల్లో ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. కాళోజీ రచనలు, పుస్తకాలు, వస్తువులు ప్రత్యేకంగా పొందుపరచాలని సూచించారు. కాళోజీ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ రూపొందించి ప్రదర్శించాలని అన్నారు. కళాక్షేత్రo నిర్మాణంలో సైతం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమంనకు ప్రముఖ కవులు, రచయితలను ఆహ్వానం పంపాలన్నారు. కాళోజీ కాలక్షేత్రానికి ప్రత్యేకంగా లోగోను రూపొందిచాలని, ముఖద్వారం వద్ద ఆకర్షనీయంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో కాళోజీ కళా క్షేత్రం పేర్లను రూపొందించాలని దేశపతి సూచించారు కాళోజి విగ్రహం, చిత్ర మాలికలకు ప్రత్యేక స్థానాలను కేటాయించాలన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ ఫౌండేషన్, కవి సమ్మేళనాలా నిర్వహణకు ప్రత్యేక సదుపాయం కల్పించాలని దేశపతి తెలిపారు.

కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడారు. కళా క్షేత్రం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండాలని అన్నారు. ఆడిటోరియం నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, కూడా సిపిఒ అజిత్ రెడ్డి, డిఇఇ రఘునందన్ రావు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు రామశాస్త్రి, శ్రీనివాస్ రావు, విద్యార్ధి, అశోక్, నిర్మాణ బాధ్యులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News