Monday, December 23, 2024

ప్రలోభ పెట్టే పథకాలు : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న ఎన్నికల దృష్టా ముస్లింలను మభ్యపెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణకు నోచని పథకాలను ప్రవేశ పెడుతోందని బిజెపి నేత, ఎన్‌డిఎంఎ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బిసి, ముస్లింలకు పథకాలను ప్రకటించడం శోచనీయమని అన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా ఫించన్లు, రైతులకు రుణామాఫీ తదితర హామీలను రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News