Monday, December 23, 2024

మహిళల అభ్యున్నతికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన శ్యామల గ్రామీణ మహిళా స్వశక్తి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధనలక్ష్మి సహజ ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొన్ని ప్రైవేట్ సంస్థలు తయారు చేస్తున్న పిండి పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా రసాయనాలు కలుపుతున్నారని, దాంతో ఆరోగ్యానికి హాని జరుగుతుందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతతో కూడుకోవడంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు కలపకుండా తయారు చేస్తున్నారన్నారు.

జగిత్యాల జిల్లాలో 172 ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ప్రారంభించుకున్నామని, సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. లక్ష్మీపూర్‌లో గానుగ నూనె యూనిట్, అంతర్గాంలో పసుపు తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకుని చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మహిళా సంఘాల యూనిట్‌లు కార్పోరేట్ స్థాయిలో అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ వ్యవసాయంలో తీసుకువచ్చిన నూతన కార్యక్రమాల వల్ల మహిళలకు ఉపాధి లభిస్తోందని, వ్యవసాయానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో రైతన్నల జీవన విధానంలో మార్పు వచ్చిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండగా, ఆంధ్రా రాష్ట్రంలో నేడు ధాన్యం కొరత ఉందన్నారు. జగిత్యాల జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, ఇదంతా సిఎం కెసిఆర్ చలవేనన్నారు. మహిళల అభ్యున్నతి కోసం వడ్డీ లేని రుణాలు, కళ్యాలలక్ష్మి, కెసిఆర్ కిట్, డబుల్ బెడ్ రూం ఇడ్లు తదితర పథకాలు అందించడం జరుగుతోందన్నారు.

పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా శక్తిని చాటి మరింత అభివృద్ది సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజేంద్రప్రసాద్, రైతుబంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్‌రెడ్డి, సర్పంచ్ మమత, ఎంపిటి స్వప్న, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, ఎపిడి సుధీర్, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎపిఎం గంగాధర్, నాయకులు జలెంధర్, తిరుపతి, మహేశ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News