Monday, November 25, 2024

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

కోరుట్ల రూరల్ : తెలంగాణ రాష్ట్ర సియం కేసిఆర్ పాలనలో అభివృద్ది సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో అయిలాపూర్ రైతు వేదిక క్లస్టర్ గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమపథకాలతో పాటు 24గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుంటే 3గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అనడం రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడమే అని మండిపడ్డారు. కోరుట్ల నియోజకవర్గంలో చెక్ డ్యాంలు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగి సాగునీటికి కొరత లేకుండా ఉందనేది రైతులు గుర్తించాలని కోరారు.

సియం కేసిఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతు ఆనందంగా ఉంటే దేశం బాగుంటుందని కోరుకునే వ్యక్తి అని తెలిపారు. నియోజకవర్గంలో9సంవత్సరాలలో జరిగిన అభివృద్ది పై చర్చకురావాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది ఎంటో చూపించాలని విద్యాసాగర్ రావు సవాల్ విసిరారు. నియోజకవర్గం అభివృద్దిలో నాతో పాటు నా కుమారుడు డా. సంజయ్ కూడా పాలుపంచుకున్నాడని అన్నారు.

కరోనా సమయంలో ఆక్సిజన్, నిరుద్యోగులకు జాబ్ మేళాలు, గ్రూప్ పరీక్షలకు హజరయ్యే వారికి ఉచిత కోచింగ్ ఇప్పించారని డా. సంజయ్ సేవలు ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకుంటారని, ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్ష నాయకులను అభివృద్ది విషయంలో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం వివిధ గ్రామాల కుల సంఘాలకు విడుదలైన నిధుల మంజూరు పాత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి తోట నారాయణ, జిరైససఅధ్యక్షులు చీటి వెంకట్రావు, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, సర్పంచులు పిడుగు రాధ సంధయ్య, వనతడుపుల అంజయ్య, ఇప్ప మంగ రాజేందర్, సాయమ్మ మల్లయ్య, ఎంపిటిసిలు బోడ గంగాధర్, నాగిరెడ్డి సుభాష్ రెడ్డి, గుగ్గిళ్ల ప్రియాంక సురేష్, చిట్నేని లత రమేష్, సింగిల్ విండో చైర్మన్లు చింతకుంట సాయిరెడ్డి, గడ్డం ఆదిరెడ్డి, నాయకులు బండి నరేష్, గట్ల అనంత స్వామి, వెంకటస్వామి, నరేందర్ రెడ్డి, బక్కోల్ల మహిపాల్, నగునూరి గంగాధర్ గౌడ్, నత్తి రాజ్ కుమార్, బాబురావు, గోపు ప్రశాంత్, ముత్తరెడ్డి, అలువాల లక్ష్మి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News