Saturday, November 16, 2024

నిరుపేదల పాలిట వరం సిఎం సహాయ నిధి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదల పాలిట వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెదిన 58 మందికి సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.16.77 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అందరికీ ఉచితంగా వైద్యం అందేలా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దడంతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందేలా అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఆనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు తీసుకున్న నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరుగుతోందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం పొందడం గగనంగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో లక్షలాది మందికి సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలవడం జరిగిందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోనే సుమారు రూ. 10 కోట్లకు పైగా సిఎంఆర్‌ఎఫ్ అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలందుతున్నాయని, ప్రజలు ప్రభుత్వాసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News