- Advertisement -
న్యూఢిల్లీ : బ్లాడర్ క్యాన్సర్ చికిత్సకు వాడే బిసిజి టీకాకు కేంద్ర ప్రభుత్వం ఎగుమతి అనుమతిని ఇచ్చింది. పుణేలోని సీరం ఇనిస్టూట్ ఆప్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిందని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పుడు దక్కిన అనుమతితో ఇవి ఇకపై కెనడాకు ఎగుమతి అవుతాయి. మూత్రాశయ క్యాన్సర్‌కు ఈ టీకా ఇమ్యూనోథెరపిగా వాడుతారు. కెనడాకు ఎగుమతి కోసం తాము ఔషధ నియంత్రణ అదీకృత సంస్థ (డిసిజిఐ)కు లేఖ రాశామని సీరం డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ తెలిపారు.
- Advertisement -