Saturday, November 23, 2024

రామన్న సల్లంగుడాలే..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాష్ట్ర ఐటి, పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 48వ జన్మదిన వేడుకలు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యా ప్తంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో పార్టీ నాయకు లు కార్యకర్తలు మొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎమ్మెల్యేలు, పలువురు ప్ర జాప్రతినిధులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించగా పలు సేవకార్యక్రమాలు చేయడంతో ….సహాయం పొందిన వారంతా… కేటీఆర్ సార్ సల్లంగుడాలే అంటూ దీవెనలు అందించారు.

మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరెన్నొ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారంతా ఆకాంక్షించారు. బిఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో మంత్రి కేటిఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద భారీ కేక్ ను కరీంనగర్ మేయర్ యాదగిరి సునిల్ రావు తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, అన్నదానం, అ ల్పాహార వితరణ, పండ్ల పంపిణీ, గిఫ్టే స్త్మ్రల్ కార్యక్రమాలు చేసిన బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు. బిఆర్‌ఎస్ కార్పోరేటర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు కేక్ కటింగ్ లు ఆలయాలు, దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, అన్నదానం, అల్పహార వితరణ, పండ్ల పంపిణీ, గిఫ్టే స్త్మ్రల్ కార్యాక్రమాలు చేపట్టారు. నిర్వహించిన సేవ కార్యక్రమాల్లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగం వదలుకొని ప్రత్యేక తెలంగాణ ద్యేయంగా స్వరాష్ట్రం కోసం ఆనాడు ఉద్య మం చేశారని తెలిపారు. సాదించిన తెలంగాణ రాష్ట్రం లో గత తొమ్మిదన్నర సంవత్సరాల కాలంలో ఐటీ, పారిశ్రామిక, పురపాలక శాఖ లో ఎన్నో మార్పులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కి సహాకరించారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వారసత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి కి బాటలు వేశారని తెలిపారు.

భారత దేశంలో ఏ మంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ చేశారని కొనియాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ను బెంగుళూరు లాంటి పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేశారని తెలిపారు. గూగుల్, ఆమేజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి ఎన్నో కంపెనీలను రాష్ట్రాలకు తెచ్చి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు నగ రపాలక, పురపాలక, మున్సిపాలిటీ ల్లో ప్రజలకు సులభతరంగా సేవలు అందించేలా కొత్త విధానాలను ప్రవేశ పెట్టి ఆన్ లైన్ పద్దతి ద్వారా ఎక్క డ అవినీతికి తావు లేకుండ ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు.

ఆస్తిపన్ను, నల్ల పన్నులు మొదలుకొని ఆన్ లైన్ లో నల్లా కనెక్షన్లు, డిజి టల్ హౌజ్ నెంబర్లు, జనన, మరణ,టీఎస్ బీపాస్ ద్వారా 21 రోజుల్లో హౌజ్ పర్మిషన్ లాంటి ఎన్నో సులభతర సేవలను ప్రజల ముందుకు తెచ్చారని తెలిపారు. ప్రజలు మున్సిపల్ కు రాకుండానే ఆన్ లైన్ ద్వారానే ప్రజలకు ప్రయోజనం జరిగేల చేసిన గొప్ప నాయకులు కేటీఆర్ అని కొనియా డారు.

మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇంకా ప్రగతిని సాదించేలా భగవంతుడు వారిని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ, బీఆర్‌ఎస్ పార్టీ నగర అద్యక్షులు చల్ల హరిశంకర్, గ్రంథ లయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ కార్పోరేటర్లు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News