- Advertisement -
ఖార్తూమ్ : సూడాన్‌లో ఆదివారం సాంకేతిక లోపంతో విమానం కూలిపోవడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోర్ట్ సూడాన్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలిపోయినట్టు సైన్యం వెల్లడించింది. మృతుల్లో సైనిక సిబ్బంది నలుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది. సూడాన్‌లో మిలిటరీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్టు దళాలకు మధ్య జరుగుతున్న పోరు సోమవారం నాటికి వందరోజుల మార్కు చేరుకుంది. ఇప్పట్లో ఈ పోరు ఆగే సూచనలు కనిపించడం లేదు. మృతుల్లో ఆర్థిక మంత్రి కార్యదర్శి అల్ తహెర్ అబ్డెల్ రెహమాన్ ఉన్నారని మిలిటరీ వెల్లడించింది.
- Advertisement -