భువనేశ్వర్: ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్, ఒడిశాలోని భువనేశ్వర్‌లో తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF)ని ప్రారంభించడంతో సుస్థిరమైన మొబిలిటీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ‘Re.Wi.Re – రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన కేంద్రాన్ని ఒడిశా ప్రభుత్వ జలవనరులు, వాణిజ్యం & రవాణా శాఖ గౌరవనీయ మంత్రి శ్రీమతి తుకుని సాహు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ప్రభుత్వం, టాటా మోటార్స్ నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అత్యాధునిక కేంద్రం పర్యావరణ అనుకూల ప్రక్రియలను ఉపయోగిస్తుంది. ప్రతి సంవత్సరం 10,000 దాకా కాలం చెల్లిన వాహనాలను సురక్షితంగా, సుస్థిరదాయకంగా విడదీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆర్వీఎస్ఎఫ్ అన్ని బ్రాండ్‌లకు చెందిన కాలం చెల్లిన ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేయడానికి వీలుగా టాటా మోటార్స్ భాగస్వామి ఎంప్రెయో ప్రీమియం ద్వారా అభివృద్ధి చేయబడి, నిర్వహించబడుతోంది. ఈ ప్రయోగం రాజస్థాన్‌లోని జైపూర్‌లోని మొదటి కేంద్రం విజయమార్గాన్ని అనుసరిస్తుంది. ఇది సంస్థ సుస్థిరదాయకమైన కార్యక్రమాలకు సంబంధించి మరో ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుంది.
ఒడిశాలో టాటా మోటార్స్ Re.Wi.Re ఆర్వీఎస్ఎఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒడిశా ప్రభుత్వ జలవనరులు, వాణిజ్యం & రవాణా శాఖ గౌరవనీయ మంత్రి శ్రీమతి తుకుని సాహు మాట్లాడుతూ, “ఈ రోజు ఒడిశాలో సుస్థిరదాయకమైన అభివృద్ధి కోసం జరుగుతున్న మా ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కొత్త స్క్రాపేజ్ కేంద్రం ద్వారా రవాణా రంగపు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే దిశగా కీలకమైన కొత్త అడుగు వేస్తున్నాం. ఈ కేంద్రం పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు సానుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడమే కాకుండా పరిశుద్ధమైన, మరింత సమర్థవంతమైన రవాణా విధానాలను కూడా ప్రోత్సహిస్తుంది. పరిశుభ్రమైన, పచ్చటి భవిష్యత్తు కోసం మాతో కలిసి ఉండాలని మా పౌరులను కోరుతూ ఈ ప్రాజెక్ట్ ను ఫలవంతం చేయడంలో పాల్గొన్న టాటా మోటార్స్, అన్ని సంస్థల నిబద్ధతను మేం అభినందిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ ఆవిష్కరణపై టాటా మోటార్స్, ట్రక్స్, బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ మాట్లాడుతూ, “టాటా మోటార్స్ లో, సుస్థిరదాయకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా పరిష్కారాలు, పూర్తి లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌ను నడపడానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం మా సరికొత్త RVSF ను ఒడిశాలో ప్రారంభించడంతో, వాహన జీవితానికి బాధ్యతాయుతమైన ముగింపు అందించే దిశగా ప్రయా ణాన్ని ప్రారంభించాం. సురక్షితమైన, సుస్థిరదాయకమైన వాహన స్క్రాపింగ్ కోసం ఆధునిక పరికరాలను ఇది అందిస్తుంది. మేం స్క్రాప్ మెటీరియల్‌ల నుండి అత్యధిక విలువను సంగ్రహించడం, ఉజ్వల భవిష్యత్తు కోసం వ్యర్థాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ను సాకారం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం చేపట్టిన అసాధారణ ప్రయత్నాలకు మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వికేంద్రీకృత సౌకర్యాలు మా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి’’ అని అన్నారు.
అత్యాధునిక కేంద్రమైన Re.Wi.Re. పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించడంపై దృష్టి సారించి, అన్ని బ్రాండ్‌లలో జీవితాంతం ప్రయాణీకుల, వాణిజ్య వాహనాలను నిర్వీర్యం చేయడం కోసం ఉద్దేశించబడింది. పూర్తి డిజిటల్ కేంద్రం, అన్ని కార్యకలాపాలు తిరుగులేని విధంగా, కాగితరహితంగా ఉంటాయి. అంతేగాకుండా, టైర్లు, బ్యాటరీలు, ఇంధనం, నూనెలు, ద్రవాలు, వాయువులతో సహా వివిధ భాగాలను సురక్షితంగా విడదీయడానికి ప్రత్యేక స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వాహనం కూడా ప్యాసింజర్, వాణిజ్య వాహనాల ఆవశ్యతకలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కచ్చితమైన డాక్యుమెంటేషన్, ఉపసంహరణ ప్రక్రియకు లోనవుతుంది. అలా చేయడం ద్వారా, ఈ ఉపసంహరణ ప్రక్రియ చిన్న చిన్నవివరాలపై కూడా గరిష్ట శ్రద్ధను నిర్ధారిస్తుంది, అన్ని భాగాలను సురక్షితంగా పారవేయడానికి హామీ ఇస్తుంది. అంతిమంగా, Re.Wi.Re. కేంద్రం వాహన పరిశ్రమలో సుస్థిరదాయకమైన విధానాలను పెంపొందించే దిశగా పురోగమించే ముందడుగును వేసింది.