Saturday, December 21, 2024

లోతట్టు ప్రాంతాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

వరంగల్ : తట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఏనుమముల పరుధిలోని ఎస్‌ఆర్ నగర్లోని లోతట్టు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పటి సరోజన సారయ్య, డివిజన్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News